కరోనా తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా ఏ మాత్రం కూడా తగ్గలేదు. కరోనా కేసులు దాదాపు అన్ని దేశాల్లో కూడా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పని చేసిన న్యూజిలాండ్ దేశంలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కరోనా  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు 2 లక్షలకు పైగా కేసులతో దూసుకుపోతుంది. 

 

1,28,39,626 మందికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకింది. కరోనా బారిన పడి  ప్రపంచ వ్యాప్తంగా 5,67,575 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అన్ని దేశాల్లో కరోనా నుంచి  74,77,717 మంది కోలుకుని బయటపడ్డారు. బ్రెజిల్, అమెరికా లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో 33 లక్షల మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: