కరోనా వైరస్ మహమ్మారి  ప్రముఖులు పేదలు అనే  తేడా లేకుండా చుక్కలు చూపిస్తుంది. ఎవరిని వదలడం లేదు ఈ  కరోనా మహమ్మారి.  బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కు కూడా కరోనా సోకింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడు, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్‌కు కరోనా సోకింది. 

 

ఆయనకు కరోనా లక్షణాలు కనపడిన నేపధ్యంలో హజ్రత్‌ గంజ్‌లోని శ్యామా ప్రసాద్ ముఖ్జీర్ ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ ఆయనకు ట్రూనాట్ పరీక్షలో కరోనా పాజిటివ్ గా వెల్లడించారు. చౌహాన్‌ ఇప్పుడు సంజయ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ) లో చేరినట్లు తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: