హైదరాబాద్ లో పూర్తిగా కరోనా సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వైద్య సేవల గురించి ఆరా తీసారు. వైద్య అధికారులను అడిగి పూర్తి స్థాయిలో ఆయన వైద్యం తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

 

కరోనా పరీక్షలను పెంచాలని , పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సరైన చికిత్స ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ తో పోరాడటానికి గానూ అవసరమైన అన్ని వైద్య పరికరాలను కేంద్రం అందిస్తుందని వారికి హామీ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రం 1200 వెంటిలేటర్లను తెలంగాణకు అందిస్తుందని... కిషన్ రెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: