ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు మ‌న‌దేశాన్ని కూడా తీవ్ర అత‌లాకుత‌లం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌దేశంలో కూడా మిగిలిన రాష్ట్రాలు అన్నింటిక‌న్నా మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధిక కేసుఉ న‌మోదు అవుతున్నాయి. దేశం మొత్తం మీద న‌మోదు అవుతోన్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లో ఏకంగా 25 శాతానికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్‌-19 కేసులు ఏకంగా 2,50,000కు చేరువవడతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. 

 

సీఎం ఉద్ద‌వ్ ధాక్రే క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక కరోనా కట్టడికి పుణే జిల్లాలో జులై 13 నుంచి పదిరోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. థానే జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకూ పొడిగించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదైనవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: