దేశ‌వ్యాప్తంగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో విల‌విల్లాడుతోన్న కాంగ్రెస్ తాజాగా అధికారంలో ఉన్న రాజ‌స్థాన్‌లోనూ ఆ పార్టీకి దిమ్మ‌తిరిగి పోయే షాక్ త‌గ‌ల‌నుంది. వాస్త‌వానికి రాజ‌స్థాన్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించాక అప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌చిన్ పైలెట్‌ను సీఎంగా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ అప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను సీఎం చేస్తార‌ని అనుకుంటే అధిష్టానం షాక్ ఇస్తూ వీరిని ప‌క్క‌న పెట్టేసి వీరి స్థానంలో సీనియ‌ర్ల‌ను సీనియ‌ర్ నేత‌ల‌కే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చింది.

 

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌తో విబేధించిన జ్యోతిరాదిత్య సింధియా ఇప్ప‌టికే బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు స‌చిన్ పైలెట్ కూడా కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజా ప‌రిణామాల‌తో గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. 
స‌చిన్ బీజేపీతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న త‌న‌కు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే స‌చిన్ త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే 19 మంది ఎమ్మెల్యేల‌తో ఢిల్లీ వెళ్లార‌ని.. ఆయ‌నతో బీజేపీ మంత‌నాలు జ‌రుపుతున్నార‌న్న వార్త‌ల‌తో ఇక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: