ఏపీలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజా అప్‌డేట్‌తో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 29 వేల‌కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాలు కూడా రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త 24 గంటల్లో 19 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. ఇక గ‌త 24 గంట‌ల్లో 846 మంది కోలుకోగా... ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 29,168 పాజిటివ్ కేసులకు గాను 13,428 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,412కు చేరుకుంది. 

 

కేసుల సంఖ్య ఎలా ఉన్నా మ‌ర‌ణాల సంఖ్య రోజు రోజుకు ఏకంగా 20 వ‌ర‌కు చేరుకుంటుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మ‌నుష్యులు అంద‌రూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండ‌రు. ఏదైనా చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్న వారు బ‌య‌ట‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారికి క‌రోనా సోక‌డంతో వారు మ‌ర‌ణిస్తున్నారు. దీంతో అటు ప్ర‌భుత్వం కూడా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు ఇటు ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే ఇక్క‌డ క‌రోనా నుంచి కాస్త సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 268 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 237 కేసులు న‌మోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: