ఏపీలో రోజు రోజుకు విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ కొన్ని జిల్లాల్లో కేసుల ప‌రంగా తీవ్ర‌త చూపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో క‌రోనా తీవ్ర‌త చూపిస్తోంది. క‌రోనా వైర‌స్ ఏపీలో విస్త‌రించ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి కూడా మిగిలిన జిల్లాల కంటే క‌ర్నూలులోనే కేసుల తీవ్ర‌త, మ‌ర‌ణాలు ఎక్కువుగా న‌మోదు అవుతున్నాయి. క‌ర్నూలులో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు ఏకంగా 3500కు చేరుకున్నాయి. ఆదివారం అప్‌డేట్‌తో ఈ ఫిగ‌ర్ ట‌చ్ అయ్యింది. ఇక మ‌ర‌ణాలు కూడా ఏపీలోనే అత్య‌ధికంగా 101 మ‌ర‌ణాలు ఈ జిల్లాలో న‌మోదు అయ్యాయి.

 

త‌బ్లిగీ కేసులు ఎక్కువ న‌మోదు కావ‌డం కూడా ఇక్క‌డ క‌రోనా కేసులు ఎక్కువ న‌మోదు కావ‌డానికి, మ‌ర‌ణాల‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక అన‌ధికారికంగా కూడా చూస్తే క‌ర్నూలు జిల్లాలో కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత ఎక్కువే ఉంటాయ‌ని అంటున్నారు. ఇక ఏపీలో గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 268 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 237 కేసులు న‌మోదు అయ్యాయి. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 3,405 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 3,290, గుంటూరు జిల్లాలో 3,019 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: