రాగల మూడు రోజుల్లో తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు రేపు మోస్తరు వర్షాలు పడగా ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 

 

అదే విధంగా రాయలసీమ లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, మూడు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దానికి తోడు బలంగా ఉన్న నైరుతీ రుతుపవనాలు కూడా కలిసే అవకాశం ఉందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: