వికాస్ దూబే వారం పది రోజుల నుంచి ఈ పేరు కాస్త ఎక్కువగా వినపడుతుంది. వారం పది రోజుల్లో అతను జాతీయ స్థాయిలో ఒక రేంజ్ లో సంచలనం అయ్యాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అతనిని అరెస్ట్ చేసిన ఒక కానిస్టేబుల్ కు కరోనా సోకింది. అతన్ని అరెస్ట్ చేసి ఉజ్జయినీ నుంచి యూపీకి తరలించే జీబులో ఉన్న కానిస్టేబుల్ కి కరోనా సోకింది. 

 

అతనికి కరోనా లక్షణాలు కనపడగా అతనికి కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు. దీనితో అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ  అయింది. కానిస్టేబుల్‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు. అతన్ని ప్రస్తుతం కాన్పూర్‌లోని ఎల్‌ఎల్ఆర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: