రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అశోక్ గెహ్లాట్ పై అసహనంగా ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళారు. వారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ తో ఉన్నారు అని తెలుస్తుంది. ఈ తరుణంలో సిఎం అశోక్ గెహ్లాట్ ను నేడు కొందరు మంత్రులు కాంగ్రెస్ నేతలు కలిసారు. 

 

ఈ నేపధ్యంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం 5 ఏళ్ళ పాటు ఉంటుంది అని ఏ ఇబ్బందులు ఉండవు అని అన్నారు. ఎమ్మెల్యే రామ్‌లాల్ జాత్ మాట్లాడుతూ, "రాజస్థాన్‌లో గెహ్లాట్ అంటే కాంగ్రెస్ & కాంగ్రెస్ అంటే గెహ్లాట్. ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదు మరియు అది దాని పదవీకాలం పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: