లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఒక మహిళను ఒక కానిస్టేబుల్ నానా రకాలుగా వేధించిన ఘటన సంచలనంగా మారింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఒక మహిళ కారుని లిఫ్ట్ అడిగాడు. అతని పేరు వీరబాబు. తనను సిఎం ఆఫీస్ వరకు డ్రాప్ చేయమని కోరాడు. 

 

ఇక అతను కానిస్టేబుల్ కావడంతో పాపం జాలి తలచి ఆమె లిఫ్ట్ ఇచ్చింది. ఇక ఈ క్రమంలో ఆమెతో మాటా మాటా పెంచి ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ లో మెసేజ్ లు చేయడమే కాకుండా ఆమెకు ఫోన్ చేసి కాస్త ఇబ్బందిగా మాట్లాడటంతో ఆమె బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ పై కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: