ఝార్ఖండ్​ పశ్చిమ సింగ్​భమ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఆ రాష్ట్ర అటవీ శాఖకు చెందిన 12 భవనాలను పేల్చి వేశారు.కొంత మంది మావోయిస్టులు బెర్​కేలా అటవీ ప్రాంతంలో ఉన్న భవనాలను చుట్టుముట్టి పోలీసులను అక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అక్కడ ఉన్న కొంత మంది అధికారులపై దాడి చేశారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

 

అనంతరం భవనాలను ఖాళీ చేయించి.. ఒకదాని తర్వాత మరొక దానిని ఐఈడీ బాంబుతో పేల్చి వేశారు.మవోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండించిన కోల్​హన్ డీఐజీ.. నక్సల్స్​ కోసం గాలింపు చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలెవ్వరూ వారికి సహాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: