ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం పేర్కొంది. వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని ఆ యూనివర్సిటీలోని ఇన్​స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ అండ్‌ బయో టెక్నాలజీ డైరెక్టర్‌ వాడిత్‌ తారాసోవ్‌ పేర్కొన్నారు.

 

ఈ దశ లక్ష్యం వ్యాక్సిన్‌ భద్రతను పరీక్షించడం అని, అది విజయవంతంగా జరిగిందని యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ పారాసిటాలజీ, ట్రాపికల్‌, వెక్టర్‌ బోర్న్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ లుకాషెవ్‌ వెల్లడించారు. టీకా భద్రత నిర్ధరణ అయ్యిందని, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రణాళికలను ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: