గత రెండు నెలల నుంచి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అండమాన్ నికోబార్ దీవుల్లో పదే పదే భూకంపాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. ఆస్తి ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా సరే  ఏదో పెద్ద భూకంపం కు సంకేతం అంటున్నారు 

 

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని డిజ్లీపూర్ కు ఉత్తరాన 153 కిలోమీటర్ల దూర౦లో ఇది సంభవించింది. ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. గత నెల 28 న కూడా ఇక్కడ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: