హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నగరంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. సిటీలో ప్రముఖ ఏరియాల నుంచి శివార్ల వరకు అన్ని ఏరియాల్లో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నగరంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. 
 
ప్రభుత్వం తొలుత నగరంలో 500కు పైగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హై రిస్క్ జోన్లుగా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అధికారులు నగరంలోని కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, చార్మినార్, చాంద్రయాణగుట్ట, మెహదీపట్నం, అంబర్ పేట్, యూసఫ్ గూడలను హై రిస్క్ జోన్లుగా గుర్తించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: