దేశంలో కరోనా కేసులు పెరగడం సంగతి పక్కన పెడితే కరోనాతో మరణించిన వారి విషయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపధ్యంలో చనిపోయిన వారి వద్దకు వెళ్ళాలి అంటే చాలు ప్రజలు భయపడుతున్నారు. 

 

తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఒక సంఘటన జరిగింది. కరోనా మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో ఒక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడే వాహనంలో తరలించారు. ఆయనే చొరవ తీసుకుని మృతదేహాన్ని తరలించే కార్యక్రమం చేసారు. మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించాలీ అని భావించినా సరే మునిసిపల్ డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో... సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్ అక్కడే ఉండి పీపీఈ కిట్టు వేసుకుని ట్రాక్టర్నడిపి స్వయంగా మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకుని వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: