ధ్రువ... రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. అతను నటన పరంగా చాలా బాగా నటించి మెప్పించాడు అనే చెప్పవచ్చు. ఇక కథకు తగిన విధంగా అతను పూర్తి స్థాయిలో న్యాయం చేసాడు అని సినిమా చూసిన ఎవరికి అయినా సరే అర్ధమవుతు ఉంటుంది. ఇక ఈ సినిమాలో దర్శకుడు చూపించిన కొన్ని కొన్ని కోణాలు చాలా బాగా మెప్పించాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత కొన్ని కొన్ని కథలకు మంచి డిమాండ్ అనేది కూడా  వచ్చింది ఆనే చెప్పాలి. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకునేది స్నేహం కూడా. కథలో అది కూడా బాగా హైలెట్ అయింది. ఐపిఎస్ లు అవ్వాలి అనుకున్న 5 మంది కూడా ఒక టీం గా ఉండి కష్టపడటం ఆ తర్వాత విధుల్లో కలిసి చేరడం వంటివి మనం ఈ సినిమాలో చూడవచ్చు. అదే విధంగా నవదీప్ తో కూడా రామ్ చరణ్ స్నేహం చాలా బాగా జనాలకు నచ్చింది. తన ఫ్రెండ్ ని చంపిన విలన్ మీద అతను  ప్రత్యేకంగా కక్ష పెంచుకోవడం  చంపినా వ్యక్తితోనే  ఆ అస్తికలకు గన్ సెల్యూట్ చేయించే విధంగా ప్లాన్ చేయడం, అలాగే నవదీప్ మరణించిన సమయంలో రామ్ చరణ్ పడిన బాధ అన్నీ కూడా ఈ సినిమాలో దాదాపుగా హైలెట్ అయ్యాయి అనే చెప్పాలి. 

 

సినిమా తర్వాత రామ్ చరణ్ రంగస్థలం అనే  సినిమాలో చేసాడు. ఆ సినిమా కూడా అతనికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు అతను. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: