ఆఫ్రికా ఖండంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దేశం సౌత్ ఆఫ్రికా. అక్కడ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ దేశ క్రికెటర్లకు కూడా కరోనా సోకింది. దీనిపై అక్కడి ప్రభుత్వం కూడా ఆందోళనలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మళ్ళీ మద్యంపై నిషేధం విధించారు. కరోనా కట్టడికి గానూ సోమవారం నుంచి మళ్లీ మద్యనిషేధం విధిస్తున్నామని ఆయన ఒక ప్రకటన చేసారు. 

 

మద్య నిషేధమే కాకుండా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కర్ఫ్యూ కూడా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అక్కడ కరోనా కేసులు 2 లక్షల 76 వేలకు పైగా ఉన్నాయి.  ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కరోనా వ్యాప్తిలో ఉంది ఆ దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: