రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపుగా సిఎం అశోక్ గెహ్లాట్ కాపాడుకున్నట్టే కనపడుతుంది. రాజస్థాన్ లో  ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఢిల్లీ వెళ్లి తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే వ్యాఖ్యలు కూడా ఆయన చేయడమే కాకుండా తన సన్నిహిత బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియా తో ఆయన సమావేశం అయ్యారు. 

 

దీనితో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని భావించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరికి విప్ జారీ చేసి సమావేశానికి రావాలి అని అధిష్టానం ఆదేశించగా సిఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో భేటీ జరిగింది. ఈ భేటీలో 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అని గెహ్లాట్ ప్రకటించారు. అక్కడ 101 మంది ఉంటే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు 102 మంది ఉండటంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనేది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: