టీం ఇండియా వెటరన్ ఆటగాడు అంబటి రాయుడు, విద్యా దంపతులకు ఆడ పిల్ల పుట్టింది. ఈ విషయాన్ని రాయుడు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో తన కుమార్తె భార్యతో కలిసి ఉన్న ఫోటో ని రాయుడు షేర్ చేసాడు. దీనిపై అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారు. 

 

ప్రస్తుతం రాయుడు భారత జట్టుకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతను  ప్రపంచకప్ కి ఎంపిక కాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని ఆడతాను అని ప్రకటించాడు. ఐపిఎల్ లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపిఎల్ కోసం అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: