మహబూబ్ నగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని మంత్రులు కేటిఆర్ ఈటెల రాజేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మెడికల్ కాలేజ్ లో త్వరలోనే టెస్టింగ్ ల్యాబ్ ని ప్రారంభిస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంపై మరింత నమ్మకం పెంచుతామని అన్నారు.

 

ప్రైవేట్ రంగం తిరస్కరించినా సరే ప్రభుత్వం కరోనా రోగులకు అండగా నిలిచిందని ఆయన అన్నారు. వైద్యం విద్య ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం అని మంత్రి చెప్పారు. వైద్యం లేక ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోవద్దు అని అన్నారు.  ఎంత ఖర్చు అయినా సరే పేదలకు వైద్యం అందిస్తామని ఆయన అన్నారు. కరోనా రోగులను వేలివేసినట్లు వ్యవహరించారని ఆయన అన్నారు. ఎవరికి అయినా కరోనా రావొచ్చు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: