భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పుడు కాస్త ఉద్రిక్త వాతావరణం ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనా ఆర్మీ ఇప్పటికే భారత్ విషయంలో కాస్త అతి చేయగా ఇప్పుడు ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ కూడా అదే విధంగా కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇక ఇప్పుడు ఉగ్రవాదులను సరిహద్దుల నుంచి పంపడమే కాకుండా అటవీ ప్రాంతాల నుంచి డ్రోన్ ల ద్వారా ఆయుధాలను అందించాలి అని భావిస్తున్న‌ట్టు కేంద్ర నిఘా సంస్థ‌లు ఇప్ప‌టికే వెల్ల‌డించాయి. 

 

భారత్ సరిహద్దు గ్రామాలకు అడవులు ఎక్కువ. ఆయా ప్రాంతాల నుంచి ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలను ఉగ్రవాదులకు అందించే విధంగా చైనాతో కలిసి పాక్ ఆర్మీ ప్రయత్నాలు చేస్తుంద‌ని నిఘా సంస్థ‌లు చెపుతున్నాయి. ఇందులో నేపాల్ సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్రంతో పాటు మ‌న బ‌ల‌గాలు పాక్ స‌రిహ‌ద్దుల్లో మ‌రింత దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: