దేశంలో కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు భారీస్థాయిలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణ జరుగుతోంది. అయితే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లలో పాజిటివ్ వస్తే కరోనా సోకినట్లేనని.... నెగిటివ్ వస్తే మాత్రం బాధితునికి కరోనా సోకిందో లేదో కచ్చితంగా చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. 
 
దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించే సమయంలో పాజిటివ్ వస్తే సదరు రోగులను ఐసోలేట్ చేయాలని.... నెగిటివ్ వస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కలిగి నెగిటివ్ వస్తే మరలా తప్పకుండా పరీక్షించాలని ప్రభుత్వం వైద్యులు, వైద్య సిబ్బందిని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: