కరోనా  అనుమానితుల విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు  పంపినట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ... పరీక్షలో పాజిటివ్ అని తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలని ఒకవేళ నెగటివ్ వస్తే మరోసారి పరీక్షించి చూడాలి అంటూ సూచించింది. ఒకవేళ రోగి కరోనా  వైరస్ పాజిటివ్ అని వస్తే వెంటనే రోగిని ఐసొలేట్  చేయాలి అంటూ కలెక్టర్లు డీఎంహెచ్వో లకు  సూచించింది. 

 

 ఒక వ్యక్తికి  వైరస్ లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగటివ్ వస్తే సదరు వ్యక్తికి ఆర్టి పిసిఆర్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అందులో నెగటివ్ వస్తే మరోసారి  ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయాలని తెలిపింది. ఇక కంటోన్మెంట్ జోన్ లలో విరివిగా అత్యధికంగా కరోనా  పరీక్షలు చేయాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: