ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి గా మారిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ యంత్రాంగం మాస్కు పెట్టుకోని  వారికి ఒక విచిత్ర శిక్ష విధించేందుకు నిర్ణయించింది, మాస్క్  పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిని.. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి అనే వాక్యాన్ని ఐదు వందల సార్లు ఇంపోజిషన్ రాయించాలని యంత్రాంగం నిర్ణయించింది. వీధుల్లో రోడ్లపైన మాస్క్  లేకుండా తిరుగుతున్న వారిని ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి.. ఈ శిక్ష అమలు చేసేందుకు యంత్రాంగం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 

 ఇందులో భాగంగా మాస్కు పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు... పెట్టుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను కూడా...మాస్క్  పెట్టుకోకుండా ఉన్న వ్యక్తులకు వీడియో  చూపిస్తారట. ఇక ఈ మొత్తం వ్యవహారం అంతా పూర్తయ్యేసరికి ఏకంగా మాస్కు పెట్టుకొని వాళ్ళు మూడు నాలుగు గంటల పాటు క్లాస్ రూమ్ లోనే గడపాల్సి వస్తుంది.ఈ  నేపథ్యంలో ప్రస్తుతం అందరూ మాస్క్ లేనిదే  బయటికి వెళ్లడం లేదు,

మరింత సమాచారం తెలుసుకోండి: