తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై వారం రోజుల్లో సమగ్ర విధానాన్ని రూపొందించనుంది. ఈ మేరకు హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. హైకోర్టులో నేడు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ గురించి విచారణ జరిగింది. ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. 
 
ప్రభుత్వ అనుమతి లేకుండా ఆన్‌లైన్ తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం, సి.బి.ఎస్.సి. నిబంధనల ప్రకారం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయని ఏజీ సమాధానం ఇచ్చారు. ఏజీ సమాధానంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే సోమవారానికి కోర్టు విచారణను వాయిదా వేసి ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై పూర్తి వివరాలను తమకు నివేదించాలని ప్రభుత్వానికి సూచించింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: