కేంద్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది.  బిజెపి అధిష్టానం త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పని తీరు విషయంలో కాస్త ప్రధాని అసహనంగా ఉన్నారు అని అంటున్నారు.

 

అదే విధంగా మరి కొందరు కేంద్ర మంత్రుల శాఖలపై కూడా ప్రధాని అసహనం వ్యక్తం చేస్తున్నారట. జల శక్తి మంత్రి విషయంలో ఆయన అసహనంగా ఉన్నారు అని సమాచారం. అందుకే శాఖలను త్వరలో మార్చే ఆలోచనలో ప్రధాని ఉన్నారట. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని కూడా  మార్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: