కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో రష్యా లో  చిక్కుకొన్న  480 మంది భారతీయ విద్యార్థులు ఇటీవలే ఓ ప్రైవేట్ ఛార్టర్డ్ విమానంలో ముంబయి చేరుకున్నారు. వీరిని భారత్ కు రప్పించేందుకు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే ఎంతగానో కృషి చేశారు. ఈ నేపథ్యంలో రష్యాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను స్వదేశానికి రప్పించినందుకు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు. 

 

 రష్యా నుండి  480 విద్యార్థులు మహారాష్ట్ర చేరుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. అయితే రష్యా నుంచి విద్యార్థులను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్క విద్యార్థికి 30 వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసినట్లు విమాన ఆన్లైన్ టికెట్ బుకింగ్ కంపెనీ తెలిపింది. అయితే ఇలా విద్యార్థులను రష్యా నుంచి రప్పించిన మంత్రి ఆదిత్య  థాక్రే  పై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: