భారతీ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా  భారీ  షాకిచ్చింది. ఈ రెండు నెట్వర్క్లకు సంబంధించిన రెడ్  ఎక్స్ ప్రీమియం ప్లాన్ ను బ్లాక్ చేసింది ట్రాయ్. ఈ రెండు ప్రణాళికలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ ట్రాయ్ పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించకుండా  ఇలాంటి ప్లాన్ లను ఎలా అమలు చేయాలనే దానిపై భారతీ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కోరింది. 

 

 కాగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి రెడ్ ఎక్స్ ప్లాన్  2019 నవంబర్ నుంచి అమలులో ఉండగా.. మే 2020లో కొత్త మార్పులు చేసింది వోడాఫోన్ ఐడియా. ఇక ఈ తరహాలోనే త్వరలో భారతీ ఎయిర్టెల్ కూడా ప్లాన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా ప్రీమియం కస్టమర్లకు కూడా అతి వేగం, ప్రాధాన్యత సేవలు ఇస్తుండడం ట్రాయ్ నిబంధన ప్రకారం నెట్  న్యూట్రాలిటీ  కి విరుద్ధంగా ఉంది అంటూ ట్రాయ్  ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: