పంజాబ్ లో అదుపులోకి వచ్చింది అని భావించిన కరోనా వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీనితో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల విషయంలో వెనక్కు తగ్గే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. తాజాగా ఆ రాష్ట్ర సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ సభలపై నియంత్రణ కొనసాగుతుందని వాటిని ఉల్లంఘించిన వారిపై తప్పనిసరి ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చారు. 

 

అవి ఇప్పుడు ఖచ్చితంగా అనుమతించేది లేదని స్పష్టం చేసారు. ప్రస్తుత౦ 50 మందితో వివాహాలు, సామాజిక సమావేశాలు నిర్వహించే వారు, ఇప్పుడు ఆ సంఖ్యను 30 కి పరిమితం చేస్తూ పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వీటిని ఉల్లంఘించే ఎవరి పైనా అయినా సరే కచ్చితంగా చర్యలు ఉంటాయి అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: