ప్రపంచంలో కరోనా బీభత్సంగా విజృంభిస్తుంది.  ఆదివారం ఒక్క రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా 2,30,000 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. అమెరికాలోనే అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తున్న‌ది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 5,285 మంది మ‌ర‌ణించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. అమెరికాలోనే అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ దేశంలో అత్య‌ధికంగా 1,42,992 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

అమెరికా త‌ర్వాత స్థానంలో ద‌క్షిణ ఆసియా ఉన్న‌ది.  ఇక వైర‌స్ మ‌ర‌ణాల్లో ఇట‌లీ దేశాన్ని మెక్సికో దాటేసింది.  ఇక అర్జెంటీనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో పాజిటివ్‌ కేసులు లక్షకు మించినట్లు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

 

ఆదివారం ఒక్కరోజే 2,657 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,00,116కు చేరింది. 700 మందికిపైగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1,845 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడ కొన్ని రోజులుగా  కరోనా కేసులు  పెరుగుతుండడంతో అర్జెంటీనా రాజధాని బ్రూనస్‌ ఎయిర్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: