తెలంగాణాలో కరోనా టెస్ట్ లను పెంచే అవకాశం ఉంది అని తెలంగాణా మంత్రి కేటిఆర్ మహబూబ్ నగర్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చకు దారి తీసాయి. ఇటీవల టెస్ట్ ల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.   అయితే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కరోనా పరీక్షలను పెంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 

 

 ప్రతీ రోజు ఏపీ తరహాలో కరోనా పరీక్షలను నిర్వహించడానికి గానూ ప్రత్యేకంగా కిట్స్ ని ఇప్పుడు విదేశాల నుంచి తెప్పించే ఆలోచన లో తెలంగాణా సర్కార్ ఉంది అని అంటున్నారు. కరోనా కట్టడికి పరిక్షలు చాలా అవసరం అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు నిపుణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: