మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. స్వచ్ఛమైన గాలి అవసరం.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కడ చూసినా పొల్యూషన్ వాతావరణమే ఉంది.  అందుకే వీలైనన్ని మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని దీక్ష పూనారు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.  ఈ నేపథ్యంలోనే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. హైదరాబాద్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని జీహెచ్ఎంసీ పార్క్ లో శర్వా కొన్ని మొక్కలు నాటారు.  ఇప్పటి వరకు ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

హైదరాబాద్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని జీహెచ్ఎంసీ పార్క్ లో శర్వా నంద్ కొన్ని మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండేలా చూసుకోవాలని.. ఎన్ని చెట్టు నాటితే భవిష్యత్ తరానికి మనం మంచి చేసిన వాళ్లం అవుతామని అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో తనతో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నేత దానం నాగేందర్ కూడా పాల్గొన్నారని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరో శర్వానంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. శర్వా అభిమానులు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: