భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ తప్పని సరి అన్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో దుబాయ్ నుండి వస్తోన్న 422 మంది తెలంగాణ ప్రయాణికులకు క్వారంటైన్ వసతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ లేఖ రాశారు.  ఈ నెల 15 లేదా 16వ తేదీన వారంతా తెలంగాణకు వచ్చే అవకాశం ఉండటంతో క్వారంటైన్ వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: