మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హరిత హారం కార్యక్రమ౦లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. చిరు వ్యాపారుల కోసం 100 కోట్ల రుణ మేళ కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు ఆయన వివరించారు. కరోనా కష్ట కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగకూడదు అనేది సిఎం కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు. 

 

రైతు బంధు కార్యక్రమాన్ని కేంద్రం కాపీ కొట్టింది అని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులకు మంత్రి చేతుల మీదుగా మొక్కలు అందించారు. ఆయనతో పాటుగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలు ఇబ్బంది పడకుండా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: