కొద్ది రోజులుగా వ‌రుస క‌రోనా కేసుల‌తో న్యూయార్క్ న‌గ‌రం ఎంత‌లా విల‌విల్లాడిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కోవిడ్‌కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ న‌గ‌రంలో కేసులు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నాలుగు నెలల తర్వాత న్యూయార్క్​లో ఆదివారం కరోనా కారణంగా  ఒక్క మరణం కూడా సంభవించలేదు. మార్చి 11న న్యూయార్క్​లో కరోనా తొలి మరణం సంభవించింది.

 

ఏప్రిల్​ 7 నాటికి పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ రోజు కోవిడ్​ లక్షణాలతో 597 మంది చనిపోగా, ఎలాంటి లక్షణాలు లేకుండా 216 మంది ప్రాణాలు విడిచారు. ఏప్రిల్​ 9న అత్యధికంగా 799 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు ఒక్క మ‌ర‌ణం కూడా లేక‌పోవ‌డంతో నాలుగు నెల‌ల త‌ర్వాత ఇక్క‌డ జీరో మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్ల‌య్యింది. ఇది పెద్ద సంచ‌ల‌నంగానే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: