భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు. ఇక త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. కరోనా విజృంభ‌ణతో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు.

 

దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన త‌మిళ‌నాడులో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే త‌మిళ‌నాడులో కొత్త‌గా 4,328 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు  మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. 

 

ఇప్పటి వరకు క‌రోనా నుంచి కోలుకున్న 3,035 మంది ఇవాళ డిశ్చార్జి అయ్యారు. ఇందులో యాక్టివ్ కేసులు 48,196 కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 92,567. మ‌ర‌ణాల సంఖ్య 2,032కు చేరిన‌ట్లు త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: