బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ కు కరోనా సోకడంతో ఇప్పుడు ఆయన తిరిగి కోలుకుని బయటపడాలి అని సోషల్ మీడియాలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆయన త్వరగా కోలుకోవాలి అని పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

 

అమిత్ జీ మీరు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నాడు. అందుకోసం ప్రార్థిస్తున్నా అని వ్యాఖ్యానించాడు. ఇక పలువురు స్టార్ క్రికెటర్లు కూడా మన దేశంలో అతను కోలుకోవాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ నానావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.  ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఐశ్వర్య కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: