దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో కరోన రికవరీ రేటు కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు మీద కేంద్ర సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 24 గంటల్లో 18,850 మంది కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

కరోనా రోగులలో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 5,53,470 గా ఉందని కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు నేడు 63.02% కి పెరిగింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉన్నాయని భారత ప్రభుత్వం  ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రికవరీ రేటు తక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: