మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం తగ్గడం లేదు. అక్కడ కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకున్నా సరే అక్కడ ప్రతీ రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరోసారి భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 6,497 తాజాగా కొత్త  కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

4,182 డిశ్చార్జ్ అయ్యారు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 193 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2,60,924 గా ఉన్నాయని ప్రకటించింది. వీటిలో 1,44,507 మంది కోలుకున్నారు. 1,05,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 10,482 మంది కరోనా కారణంగా మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: