దేశంలో కరోనా వైరస్ కారణంగా చాలా సంస్థలు  ఇప్పుడు ఉద్యోగులను విధులను తొలగిస్తున్నాయి. తమ సంస్థల్లో జీతాలు ఇవ్వలేక అగ్ర కంపెనీలు సైతం విధుల నుంచి తమ ఉద్యోగులను తప్పిస్తునే ఉన్నాయి. తాజాగా విప్రో కీలక ప్రకటన చేసింది. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

 

విప్రో వార్షిక సమావేశాల్లో కరోనా ప్యాండెమిక్ కారణంగా తమ ఐటీ సంస్థలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని అన్నారు. వైరస్ కారణంగా ఉద్యోగాల్లో ఎటువంటి కోతలు విధించే ఆలోచన కూడా తమకు లేదన్నారు. లాభ నష్టాలు అనేవి సహజం అని ఉద్యోగులను తొలగించే అవకాశమే లేదని అలాంటి చర్యలు భవిష్యత్తు లో కూడా ఉండవు అని పెరోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: