విశాఖ పరవాడ ఫార్మా సిటీలో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అని స్థానికులు చెప్తున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. పేలుళ్ళ శబ్దాలతో దగ్గరకు అగ్నిమాపక యంత్రాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కచ్చితంగా కారణం తెలియదు గాని...

 

ఈ కంపెనీలో శానిటైజర్ లు తయారు చేస్తున్నారు. దగ్గరలో అనేక కంపెనీలు ఉండటంతో అక్కడ  ఉన్న కంపెనీలకు మంటలు అంటుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది.   అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   మంటలు పెద్ద ఎత్తున రావడంతో సమీప౦లో భారీగా పొగ అలముకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: