గత 25 ఏళ్లలోనే అత్యంత ప్రకాశవంతమైన 'నియోవైజ్'​ తోకచుక్క భూమికి అతి సమీపానికి చేరువైందని నాసా పేర్కొంది. సోమవారం అత్యంత ప్రకాశవంతంగా ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ తోకచుక్కకు సూమారు 3.4 లక్షల కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. సౌర వ్యవస్థకు చెందిన ఈ తోక చుక్క ఆగస్టు వరకు ఆకాశంలో కనిపించనుంది.

 

సూర్యుడి సమీపంలో ఉన్న కొన్ని శిథిలాలు కలసి నియోవైజ్​ తోకచుక్క ఆవిర్భవించింది. నాసాకు చెందిన 'నియోవైజ్​ ఇన్​ఫ్రారెడ్​ స్పేస్ టెలిస్కోప్' మార్చిలో దీన్ని కనిపెట్టింది. దీంతో దాని పేరు మీదనే ఈ తోకచుక్కకు 'నియోవైజ్'​ అని పేరు పెట్టారు.
నియోవైజ్​ తోకచుక్క అత్యంత ప్రకాశవంతమైనది. ఇది ఎలాంటి సాంకేతిక పరికరాలు లేకుండానే కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి. అయితే దానిపొడవును బైనాక్యులర్ల సాయంతో చూడవచ్చని వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: