విశాఖ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో నిన్న రాత్రి 10.20 గంటల సమయంలో ట్యాంకర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కంపెనీలోని ఆరుగురు సిబ్బంది గాయాలపాలయ్యారు. ఒక రకమైన వృథా ఆయిల్‌ను శుభ్రపరిచే ప్రక్రియ కంపెనీలో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఇటీవల ప్రమాదం చోటు చేసుకున్న సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలోనే విశాఖను భారీ వర్షం ముంచెత్తడంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: