ప్రపంచం ఇప్పడు కరోనా వైరస్ తో అల్లాడిపోతుంది. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాని పరిస్థితిలో ప్రపంచం ఉంది. ఈ తరుణంలో ఎబోలా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సంచలన ప్రకటన చేసింది. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విస్తరిస్తుంది అని ప్రకటన చేసింది. కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దుల్లో 48 ఎబోలా కేసులు వచ్చాయి అని పేర్కొంది. 

 

మైక్ ర్యాన్ ఆనే అధికారి దీనికి సంబంధించి  ప్రకటన చేసారు. జూన్ 1 వ తేదీ నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది అని దీనితో 20 మంది ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొంది. అది చాలా చురుకుగా వ్యాపిస్తుంది అని హెచ్చరించింది. ఇక అక్కడ కరోనా కూడా ఎక్కువగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: