హైదరాబాద్ లో నిన్న భారీ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా బండ్లగూడలో 5.9 సెం.మీల వర్షపాతం నమోదు అయింది. రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ  పేర్కొంది. బండ్ల గూడలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా వర్షం పడింది. 

 

దీనితో రోడ్ల మీద భారీగా నీళ్ళు చేరాయి. గోషామహల్‌, మెహిదీపట్నంలో మాత్రమే కాస్త తక్కువగా పడింది వర్షం. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో హైదరాబాద్ లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అని పేర్కొంది వాతావరణ శాఖ. అటు ఆంధ్రాకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: