ప్రకృతిలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, పూల మొక్కలు, కీటకాలు ఉంటాయి. వాటి రూపం కొన్ని అందంగా ఉంటే.. మరికొన్ని బయంకరంగా ఉంటాయి. పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షలు మనం చూస్తుంటాం.. అప్పుడప్పుడు మన కంటికి కనిపించని అరుదైన పక్షులు కూడా తారసపడుతుంటాయి.  ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ తరహా అందాలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కనిపించింది. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా గుర్తించారు.

 

దీనికి పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించింది. ఈ అరుదైన పక్షిని వీక్షించగానే స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. 

 

అంతేకాదు ఈ తరహా పక్షులు చాలా అరుదుగా ఉంటాయని.. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: