రాజస్థాన్ లో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు దాదాపుగా లేవనే విషయం అర్ధమవుతుంది. అసెంబ్లీ లో మెజారిటి నిరూపించుకోవాలి అని సచిన్ పైలెట్ సిఎం గెహ్లాట్ కు సవాల్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం కాస్త వేడెక్కింది. తన వర్గం ఎమ్మెల్యేలను సిఎం ఇప్పటికే రిసార్ట్ కి కూడా తరలించి రాజకీయం మొదలుపెట్టారు. 

 

నేడు మరోసారి సిఎల్పీ సమావేశం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తన వెంట మొత్తం 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని సిఎం అంటున్నారు. ఇక  కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగడంతో ప్రభుత్వం కూలిపోవడం కష్టమే అని,   కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటుగా స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సిఎం కే మద్దతు పలుకుతున్నారు అని సమాచారం. నిన్న సిఎల్పీ సమావేశానికి 16 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: