దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టెస్ట్ లను కూడా భారీగానే నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు కూడా 2 లక్షలకు పైగా కరోనా పరిక్షలు మన దేశంలో జరుగుతున్నాయి. ఇక కరోనా పరిక్షల విషయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. 

 

జూలై 13 వరకు 1,20,92,503 నమూనాలను పరీక్షించారని తాజాగా ఐసిఎంఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 2,86,247 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్   వెల్లడించింది. ఏపీలో కరోనా పరిక్షలు 12 లక్షల దిశగా వెళ్తున్నాయి. ప్రతీ రోజు కూడా 20 వేల వరకు కరోనా పరిక్షలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో కరోనా పరిక్షలు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: