ఏపీలో అధికార వైసీపీ పార్టీలో ప‌ద‌వుల కోలాహాలం ప్రారంభ‌మైంది. ప్రస్తుతం మండ‌లిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. అయితే రాజ్య‌స‌భ‌కు ఎంపికైన తాజా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ఖాళీ చేసిన సీటు ప‌దవీ కాలం కేవ‌లం 9 నెల‌లు మాత్ర‌మే ఉండ‌డంతో ఈ స్థానాన్ని వ‌దిలేసి మిగిలిన మూడు సీట్ల‌కు మాత్ర‌మే ఎన్నిక జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక వైసీపీలో ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. ఇక గవర్నర్‌ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్‌ను సీఎం జగన్‌ దాదాపు ఖరారు చేశారని వైసీపీ వర్గాలు తెలిపాయి. 

 

వీరిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ గ‌తంలోనే ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక మూడో సీటును కడపకు చెందిన మైనారిటీ మహిళతో భర్తీ చేసే చాన్సుందని వెల్లడించాయి. తమకో ఎమ్మెల్సీ సీటివ్వాల ని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన మైనారిటీ నేతలు కోరుతున్నారని.. ఈ నేపథ్యంలో రాయచోటికి చెందిన ముస్లిం మై నారిటీ మహిళకు ఈ పదవి ఇవ్వాలని భావిస్తున్నార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: